News February 20, 2025
లక్ష్మణచాంద: భార్య మందలించిందని భర్త సూసైడ్

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన లక్ష్మణచాందలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. సీతక్కకి పవార్ రమేశ్ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. గత 15వ తేదీన బాగా మద్యం తాగి ఇంటికి రాగా అతని భార్య జ్యోతి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుమందు తాగారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగా పరిస్థితి విషమించి మరణించారు.
Similar News
News January 2, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో వైన్ షాపుల సిండికేట్ దందా?

వైన్‌షాపు యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో మొదలై ఉమ్మడి KNRలోని పలుచోట్లకు అంతర్గతంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బాటిల్‌పై MRP రేట్ల కంటే రూ.10-50 అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 287 వైన్స్, 76 బార్లు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్ అధికారులు లైట్‌గా తీసుకోవడం గమనార్హం.
News January 2, 2026
అన్నమయ్యలో రూ.5.54కోట్ల మద్యం తాగేశారు!

అన్నమయ్య జిల్లాలో నూతన సంవత్సర సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అన్నమయ్య జిల్లాలో 11 బార్లు, 124 వైన్ షాపులు ఉన్నాయి. అన్ని రకాల బ్రాండ్లతో కలిపి 7,463 మద్యం బాక్సులు, బీర్లు 3,475 బాక్సులు ఐఎంఎల్ డిపో నుంచి షాపులకు చేరాయి. ఈ మద్యాన్ని ఒకటో తేదీన మందు బాబులు తాగడంతో ప్రభుత్వానికి రూ.5.54కోట్ల ఆదాయం వచ్చింది.
News January 2, 2026
సోమశిల కృష్ణానదిలో యువకుడి గల్లంతు

కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన వెలుగు చూసింది. HYD కు చెందిన అశోక్(35) నలుగురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నది తీరానికి వచ్చారు. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడిన అశోక్ కనిపించకుండాపోయినట్లు స్నేహితులు తెలిపారు. అశోక్ ఆచూకీ కోసం స్థానికులతోకలిసి స్నేహితులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ ఇంకా లభించలేదు.


