News April 4, 2025

లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే టాప్

image

ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీడీఓ రాధారాథోడ్ గురువారం తెలిపారు. 99 శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు ఎంపీఓ ఆమీర్ ఖాన్, ఆయ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆమె అభినందించారు. ఇందుకు సహకరించిన లక్ష్మణచాంద మండల ప్రజలకు, వాణిజ్య సముదాయాలకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 30, 2025

సంక్రాంతికి టోల్ ‘ఫ్రీ’ అమలు చేయండి: కోమటిరెడ్డి

image

TG: సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మార్గాల్లో టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేయొద్దని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి 9 నుంచి 18 వరకు దీన్ని అమలు చేయాలని కోరారు. ఇక సంక్రాంతి వేళ విజయవాడ-హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ సమస్యపై CM రేవంత్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కోమటిరెడ్డి మీడియాకు చెప్పారు.

News December 30, 2025

పాలమూరు: రేపు కురుమూర్తి స్వామి గిరిప్రదక్షిణ

image

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న స్వామివారి గిరిప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (1/4)

image

ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలను ఎస్పీ నచికేత్ వివరించారు.
✎ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 5406 మందిపై 5379 కేసులు నమోదు
✎ SC, ST అట్రాసిటీ కేసులు గత ఏడాది 78, ఈ ఏడాది 71 నమోదు
✎ ప్రాపర్టీ నేరాల కేసులు 575 నమోదు. వాటిలో 330 కేసుల ఛేదింపు. పోగొట్టుకున్న సొత్తు విలువ రూ.8.59 కోట్లు.. రికవరి రూ.4.15 కోట్లు
✎ డ్రంకెన్ డ్రైవ్‌‌లో 1713 కేసులు నమోదు. 1,251 కేసుల్లో జరిమానా, 49 మందికి జైలు శిక్ష.
<<18714494>>CONTINUE<<>>