News April 20, 2025

లక్ష్మణచాంద: వాగులో బాలుడి మృతదేహం లభ్యం

image

లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల రాంచరణ్ (14)అనే బాలుడి మృతదేహం స్థానిక వాగులో ఆదివారం లభ్యమైంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రాంచరణ్ రోజూ లాగే శనివారం మధ్యాహ్నం దోస్తులతో కలిసి వాగులో స్నానం చేయటానికి వెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్ ప్రవహిస్తున్న కారణంగా వాగులో నీటి ఉద్ధృతి పెరిగి రాంచరణ్ నీటిలో మునిగిపోయి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 20, 2025

వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

image

వైవీయూ11,12,13,14వ కాన్వకేషన్స్ జూన్/ జులై నెలల్లో నిర్వహించనున్నామని వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. వీసీ ప్రొ. అల్లం శ్రీనివాస రావు స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ను http://convocation.yvuexams.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

News April 20, 2025

మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

image

స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వారిలో ఆడాలన్న ఆకలి, తమ జట్లకు ట్రోఫీలను గెలిపించాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. ఇద్దరూ భారత్‌లో హాలిడే చేసుకోవడానికి వచ్చారంతే. నేను చాలామంది ఓవర్సీస్ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధికశాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది IPLలో మ్యాక్సీ PBKSకి, లివింగ్‌స్టోన్ RCBకి ఆడుతున్నారు.

News April 20, 2025

IPL: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడేలో MIvsCSK మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.

జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని

error: Content is protected !!