News August 13, 2025

లక్ష్మీ నరసింహం: గుంటూరు తొలి ఎంపీ

image

స్వాతంత్ర్య సమరయోధుడు శిష్ట్లా వెంకట లక్ష్మీ నరసింహం 1911 మే 24న ఉమ్మడి గుంటూరులో జన్మించారు. 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్.జి.రంగాను ఓడించి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా 1936 నుంచి 2004 వరకు పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో రెండు సార్లు జైలుకు వెళ్లారు. 2006 సెప్టెంబర్ 28న 96 ఏళ్ల వయసులో మరణించారు.

Similar News

News August 14, 2025

మెట్ పల్లి: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: మధుయాష్కి గౌడ్

image

BRS పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. మెట్ పల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా, కోరుట్ల ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ఉన్న హయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కృష్ణారావు తదితరులున్నారు.

News August 14, 2025

బాసర ఆర్జీయూకేటీలో మాదకద్రవ్యాలపై అవగాహన

image

బాసరలోని ఆర్జీయూకేటీలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్‌ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలను వాడబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.

News August 14, 2025

వేములవాడ: ‘యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు’

image

వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. వేములవాడ ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపల్ టి.శంకర్ పేర్కొన్నారు.