News January 24, 2026
లక్ష్యాలను సాధించి ‘ఎ’ గ్రేడ్ పొందాలి: కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో ‘బి’, ‘సి’ గ్రేడ్లలో ఉన్న శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకుని ‘ఎ’ గ్రేడ్ సాధించాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారులు అలసత్వం వహించకూడదని, ప్రగతి సూచికల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News January 28, 2026
బాబాయ్ బాటలో ప్రజాసేవలోకి..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ అనంతరావ్ పవార్ తన బాబాయ్ బాటలో ప్రజాసేవలోకి వచ్చారు. 1959 జులై 22న జన్మించిన అజిత్ మొదట 1982లో షుగర్ ఫ్యాక్టరీ సంఘం ఎన్నికల్లో గెలిచారు. 1991లో బారామతి నుంచి MPగా చట్టసభలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది బారామతి MLAగా గెలిచి ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించారు. MHలో పలు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.
News January 28, 2026
గ్రూప్ – 2 ఫలితాల్లో సత్తా చాటిన ప్రకాశం పోలీసులు

తాజాగా విడుదలైన గ్రూప్ – 2 ఫలితాలలో ప్రకాశం పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు తమ సత్తా చాటారు. 2018 సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన కే. అశోక్ రెడ్డి, కే .వెంకటేశ్వర్లు, సూర్య తేజలు గ్రూప్ – 2 ఫలితాలలో పలు ఉద్యోగాలను సాధించారు. అశోక్ రెడ్డి డిప్యూటీ తహశీల్దారుగా, ఎక్సైజ్ ఎస్సైలుగా వెంకటేశ్వర్లు, సూర్య తేజలు ఎంపికయ్యారు. వీరికి తోటి సిబ్బందితో పాటు అధికారులు అభినందనలు తెలిపారు.
News January 28, 2026
WGL: అటు మేడారం.. ఇటు ఎన్నికల జాతర!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతర నేడు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. ఒకవైపు వన దేవతలను దర్శించుకుని తనివి తీర జాతర చూసి తరలించాలన్న కోరిక.. మరోవైపు ఎన్నికల క్షేత్రంలో పాల్గొనాల్సిన విచిత్రమైన పరిస్థితి నెలకొంది.


