News April 6, 2025

లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-డీ, జూనియర్ లెక్చరర్, ఆర్ఆర్‌బీ, ఐడీబీసీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఎలాంటి పుస్తకాలు కావాలి, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News April 6, 2025

భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.

News April 6, 2025

గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

image

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.

News April 6, 2025

మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులు, తలంబ్రాలు

image

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కాగా ముత్యాల తలంబ్రాలను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తీసుకువచ్చారు. దీంతో మిథిలా స్టేడియంలో ఉన్న భక్తుల్లో కోలాహలం నెలకొంది.

error: Content is protected !!