News November 14, 2024
లగచర్ల ఇష్యూ.. ఈ మండలాల్లో ఇంటర్నెట్ బంద్!

కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. గ్రామం నిర్మానుష్యంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో BRS నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసనలు తెలిపారు.
Similar News
News February 14, 2026
పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

✒గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన AIFB విజేతలు
✒పాలమూరు: జాగృతి, AIFB ఉమ్మడి విజయం: జోజిరెడ్డి
✒జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ
✒పాలమూరుకు మహర్దశ.. రూ.3,175 కోట్లతో హైవే
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పాలమూరులో ‘గ్లాసు’ ఖాళీ.. ప్రభావం చూపని జనసేన
✒గద్వాల్:జంపింగ్ ఎమ్మెల్యేలకు BRS ‘విప్’ సెగ
✒శివరాత్రి.. రేపు ఆలయాల వద్ద బందోబస్తు:SP
News February 14, 2026
MBNR: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం, మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వీరన్నపేట పెద్ద శివాలయం, పిల్లల మర్రి వద్దనున్న శివాలయం వద్ద పటిష్ఠ భద్రత ఆ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వెల్లడించారు.
News February 14, 2026
జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్‌లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్‌నగర్ జిల్లాకు, జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ఇవాళ స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూస్ అందజేశారు. ఈనెల 17 నుంచి HYDలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొననున్నారు.


