News November 13, 2025
లడ్డూలతో రాజకీయం ఏంటి?: శ్రీవారి భక్తుల ఆగ్రహం

పవిత్రమైన <<18276380>>లడ్డూ ప్రసాదాన్ని<<>> చూపిస్తూ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ రాజకీయం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ధర్మారెడ్డి విచారణకు వచ్చిన సమయంలోనూ లడ్డూలు చూపించి పబ్లిసిటీ స్టంట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలోనే.. తిరుపతి ప్రెస్ క్లబ్లో లడ్డూలు, వడ ప్రసాదాలను బెంచిపై పెట్టి ప్రదర్శించారు. ఇలా లడ్డూలను ముందు పెట్టి రాజకీయం కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని పలువురు కోరుతున్నారు.
Similar News
News November 13, 2025
సూర్యాపేట: 5,560 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

అధిక లాభాలు చేకూర్చే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేసేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్‌లో పీఏసీఎస్, అధ్యక్షులు, కార్యదర్శులు, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 5,560 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగిందని అన్నారు.
News November 13, 2025
క్యురేటర్‌తో గంభీర్, గిల్ సుదీర్ఘ చర్చ.. పిచ్‌పై అసంతృప్తి?

కోల్‌కతా వేదికగా రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ క్యురేటర్ సుజన్ ముఖర్జీతో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పిచ్‌ను కోచింగ్ టీమ్, BCCI క్యురేటర్లు, గిల్, పంత్ తదితరులు పరిశీలించారు. తర్వాత 30 నిమిషాలపాటు డిస్కషన్ జరిగింది. పిచ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
News November 13, 2025
పానగల్: తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

పానగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్ సందర్శించి పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పురోగతిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రికార్డు రూమ్‌ను తనిఖీ చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.


