News April 17, 2025
లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: MLC కవిత

భీంగల్‌లో BRS పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీని డిమాండ్ చేశారు. అలాగే BRS కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని ఆమె X లో డిమాండ్ చేశారు. లాఠీచార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదన్నారు.
Similar News
News December 28, 2025
NZB: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ టౌన్ ఎస్‌హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన చింతల ఏడ్డి రాజన్న(50) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. మృతుని భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
News December 28, 2025
NZB: రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్‌బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
News December 27, 2025
NZB: 129 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఇన్‌ఛార్జ్ CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.


