News January 13, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 84,038 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 25,836 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, టెక్ మహీంద్రా, SBI, BEL, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎల్ అండ్ టీ, TCS, రిలయన్స్, M&M, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Similar News
News February 8, 2026
రేపు జానకీ జయంతి.. ఇలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం

శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జయంతి రేపు. దీనినే జానకీ జయంతి/సీతా అష్టమి అంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేయాలి. పీటపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి సీతారాముల ఫొటో పెట్టి పూలతో అలంకరించాలి. ఎర్ర చీర, పూలు, గాజులు, సింధూరం సమర్పించి పూజించాలి. సీతారాముల అష్టోత్తరం చదవాలి. 5/9 మంది సుమంగళులకు పసుపు కుంకుమ, గాజులు, పూలు ఇచ్చి భోజనం పెట్టాలని పండితులు చెబుతున్నారు.
News February 8, 2026
SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News February 8, 2026
తన పురుషాంగం, తల దాచాలని కోరాడు

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ గురించి పలు విచిత్ర విషయాలూ బయటకొస్తున్నాయి. అందులో ఒకటి.. Cryonics. పిలిచే నిరూపితం కాని ఈ సైన్స్ ప్రక్రియలో మృతదేహాన్ని -195° నుంచి -320° మధ్య ఫ్రీజ్ చేస్తారు. ఆ వ్యక్తికి గల రోగం/సమస్యకు ఫ్యూచర్‌లో సరైన పరిష్కారం దొరికినప్పుడు తిరిగి యాక్టివ్ చేసి చికిత్స చేస్తారు. దీన్ని బాగా నమ్మిన ఎప్‌స్టీన్ తన తల, పురుషాంగం ఫ్రీజ్ చేయాలని సైంటిస్టులకు సూచించాడట.


