News February 2, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 81055కు చేరగా నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,886 వద్ద ట్రేడవుతోంది. L&T, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News February 5, 2026
‘ఎనర్జీ’లో రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్

AP: నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం ఇవాళ సచివాలయంలో CS విజయానంద్‌ను కలిసి ఎనర్జీ ట్రాన్సిషన్ డ్రాఫ్ట్ బ్లూప్రింట్‌ను అందించారు. దీని అమలు ద్వారా రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడితో AP రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మారుతుంది. 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. పగటి పూట నిరాటంక సరఫరాతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4కి, సరఫరా ఖర్చు రూ.6కు తగ్గుతుంది. కాగా దీని అమలుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News February 5, 2026
టీచర్ పోస్టులు.. 1.17లక్షల్లో 296 మందే పాస్!

సీనియర్ టీచర్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2024కు సంబంధించి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాకింగ్ రిజల్ట్స్ వెల్లడించింది. 320 సైన్స్ లెక్చరర్ పోస్టులకు 1.68 లక్షల మంది అప్లై చేశారు. గత SEPలో 25జిల్లా కేంద్రాల్లో 1.17 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో కేవలం 296 మంది అభ్యర్థులే క్వాలిఫై అయ్యారు. ఎంపిక విధానంపై హైకోర్టులో పిటిషన్ వేయగా ‘అభ్యర్థులు రూల్స్ తెలిసే పరీక్షకు హాజరవుతారు’ అని తోసిపుచ్చింది.
News February 5, 2026
వాషింగ్టన్ పోస్ట్ నిర్ణయం ఆత్మహత్య లాంటిదే: శశిథరూర్

తన కొడుకు ఇషాన్‌ను వాషింగ్టన్ పోస్ట్ <<19054288>>తొలగించడంపై<<>> కాంగ్రెస్ MP శశిథరూర్ ఫైరయ్యారు. ‘వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంలో వింత ఏంటంటే.. ఇషాన్ కాలమ్ ప్రాచుర్యం పొందింది. ఆయన WorldViewకు 5లక్షల ఫాలోవర్లు ఉన్నారు. విదేశీ మంత్రులు, రాయబారులు చదువుతారు. ఈ ఫాలోయింగ్‌ను ధనార్జనకు వాడుకోవచ్చు. కానీ కాలమ్‌ను తీసేయడం ఆత్మహత్యలా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు.


