News December 26, 2025
లారీని ఢీకొట్టిన కారు.. విశాఖ వాసి మృతి

పూసపాటిరేగ మండలంలోని గుండపురెడ్డిపాలెం వద్ద హైవేపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన దక్షిణామూర్తి(58) మరణించారు. చీపురుపల్లి నుంచి విశాఖ వెళ్తుండగా ముందున్న లారీని ఢీకొట్టి కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం దుర్మరణం చెందాడు. మృతుడి కొడుకు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.
Similar News
News January 1, 2026
హ్యాపీ న్యూ ఇయర్..

కొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ న్యూ ఇయర్ వచ్చేసింది. ఎన్నో అనుభూతులను మిగిల్చిన 2025కు వీడ్కోలు చెబుతూ 2026ను ప్రపంచం ఆహ్వానించింది. గడియారం ముల్లు 12.00 దాటగానే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. టపాసుల మోత, కేకుల కోత, డీజే పాటలు, యువత కేరింతలతో సంబరాలు మిన్నంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఈవెంట్లు, లైట్ షోలు, కన్సర్ట్‌లు హోరెత్తుతున్నాయి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
News January 1, 2026
TODAY HEADLINES

✦ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న TG CM రేవంత్
✦ ఉద్యోగులకు రూ.713 కోట్లు విడుదల చేసిన TG సర్కార్
✦ గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్
✦ APలో పెరుగుతున్న స్ర్కబ్ టైఫస్ కేసులు.. ఇప్పటివరకు 2 వేలకుపైగా నమోదు, 22మంది మృతి
✦ పెయిన్‌కిల్లర్ డ్రగ్ Nimesulide తయారీ, సేల్స్‌పై బ్యాన్: కేంద్రం
✦ కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్
News January 1, 2026
ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్‌ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.


