News February 10, 2026
లావున్నారా? ఈ డిసీజెస్‌తో మరణ ముప్పు 70% అధికం!

ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ వల్ల హాస్పిటలైజ్ కావడం లేదా చనిపోయే ప్రమాదం ఒబెసిటీ ఉన్నవాళ్లలో ఎక్కువట. కొవిడ్, ఫ్లూ, నిమోనియా వంటి వ్యాధుల వల్ల ఈ ముప్పు 70% అధికమని లాన్సెట్‌లో స్టడీ తేల్చింది. అధ్యయనంలో భాగంగా 5.40 లక్షల మందిని 13-14 ఏళ్ల పాటు స్టడీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒబెసిటీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌తో మరణించే ప్రమాదమూ పెరిగే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Similar News
News February 19, 2026
దోసకాయ బంగారమాయె.. రష్యాలో కిలో రూ.355

నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయలు కిలో 300 రూబల్స్(₹355) చొప్పున అమ్ముతున్నారని, కొన్నిచోట్ల 2, 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం మాంసంతో సమానంగా ధర ఉంటోందని చెబుతున్నారు. దోసకాయలే ఇప్పుడు తమకు బంగారంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.
News February 19, 2026
బెండలో పేనుబంక వల్ల కలిగే నష్టాలేమిటి?

బెండ పంటను పేనుబంక పురుగులు ఆశిస్తే ఆకులు, రెమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పేనుబంక పురుగులు ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీని వల్ల నల్లటి బూజు తెగులు ఆశిస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంది.
News February 19, 2026
IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


