News January 9, 2025
లా కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మూడేళ్ల LLB, LLB ఆనర్స్, ఐదేళ్ల బీఏ LLB, ఐదేళ్ల బీకామ్ LLB, ఐదేళ్ల బీబీఏ LLB తదితర కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.
Similar News
News July 5, 2025
HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.
News July 5, 2025
రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్‌ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.
News July 5, 2025
HYD: వీకెండ్ స్పెషల్.. నేచర్ క్యాంప్

HYD శివారు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో వీకెండ్ స్పెషల్ ఎంజాయ్ చేసేందుకు సువర్ణ అవకాశం. నేటి సా.5 నుంచి ఆదివారం ఉ.9:30 వరకు నేచర్ క్యాంపు ఉంటుంది. టీం బిల్డింగ్, పిచ్చింగ్, రాత్రిపూట అడవిలో వాకింగ్, నైట్ క్యాంపింగ్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రేక్కింగ్ చేయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఫ్రీ. మిగతా వారికి రూ.1,199 అని అధికారి రంజిత్ తెలిపారు. వివరాలకు 7382307476 నంబర్‌ను సంప్రదించండి.