News September 21, 2025

లా విద్యార్థులకు విజయవాడలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం

image

APCRDA కార్యాలయం నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు 2025లో లా కోర్సు పూర్తి చేసినవారు, ఫైనలియర్ LLB చదివేవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో ఇద్దరిని ఎంపిక చేస్తామని, వివరాలకు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్ చూడాలని సూచించారు.

Similar News

News September 21, 2025

KMR: బతుకమ్మ పూల కోసం పొరుగు జిల్లాకు

image

బతుకమ్మ అలంకరించడానికి అవసరమైన గునుగు పూల కోసం ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. తమ ప్రాంతంలో పూలు దొరకకపోవడంతో ఆటోలో సంగారెడ్డి జిల్లాలోని కంగ్టికి వెళ్లి తిరిగి వస్తుండగా పిట్లంలో ఆగారు. ‘బతుకమ్మ అంటేనే పూల పండుగ అని, అందుకే ఎన్ని కష్టాలైన పడి, ఎన్ని కి.మీ. ఉన్నా సరే పూలను సేకరించి పండుగను జరుపుకొంటామని వారు Way2Newsతో చెప్పారు.

News September 21, 2025

అతిధి ప్రోటోకాల్ సక్రమంగా చూడాలి: మంత్రి

image

పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అమ్మవారి పండగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం అమ్మవారి పండగ, ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారుల పై గుంతలు లేకుండా చూడాలని, అతిధుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

News September 21, 2025

వరంగల్: ఎంగిలిపూల బతుకమ్మ విశిష్టత ఇదే..!

image

పూల పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఆహ్వానిస్తూ ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ చేస్తారు. వర్షాకాలం ముగిసి కొత్త పంటలు రావడానికి సిద్ధమయ్యే రోజుగా భావిస్తారు. ఇదే రోజున గౌరమ్మను తమ ఇంటికి ఆహ్వానించే రోజుగా కొలుస్తారు. తొలిరోజు బతుకమ్మ బంధువులను స్నేహితులను కలిపే రోజుగా తలుస్తారు. వైద్య గుణాలు కలిగిన తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి పువ్వులు వాడటం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై మీ కామెంట్.