News January 12, 2026

లింగంపల్లి శివారులో కారును ఢీకొన్న కంటైనర్

image

మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చిన కంటైనర్, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 17, 2026

నియోజకవర్గ సమస్యలపై సీఎం రివ్యూ

image

అల్లూరి, పోలవరం, మన్యం జిల్లాల సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు మంగళవారం రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అల్లూరి, పోలవరం కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్ధర్‌తో పాటు మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. రివ్యూలో రంపచోడవరం నియోజకవర్గంలోని ప్రతి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే శిరీష దేవి తెలిపారు.

News February 17, 2026

రేపటి నుంచి శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 17, 2026

పెద్దపల్లి: గ్రామాల్లో నిబంధనల ప్రకారమే పాలన: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల్లో నిబంధనల మేరకే పాలన సాగాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 3వ విద్యుత్ వైరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రోడ్లపై చెత్త లేకుండా చూడాలని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీపీఓ వీర బుచ్చయ్య పాల్గొన్నారు.