News August 16, 2025
లింగంపేటలో 977 కేసులు పరిష్కారం

కామారెడ్డి జిల్లాలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ పైలెట్ ప్రాజెక్ట్ మంచి ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన లింగంపేట మండలంలో ఇప్పటి వరకు 977 భూ వివాదాలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు.
Similar News
News August 16, 2025
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే లాస్ట్ డేట్!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు విభాగాల్లో 5,220 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాగా, అప్లై చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 4,987 <
News August 16, 2025
కడెం ప్రాజెక్ట్ దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాలు అధికంగా కురిసి, ప్రాజెక్టు గేట్లను ఎత్తినందున.. కడెం ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 16, 2025
ధారూర్: చిక్కిన భారీ చేప

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు, నిండుకుండలా మారాయి. ధారూర్ సమీపంలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్ సమీపంలో శనివారం స్థానికులు చేపల వేటలో బిజీబిజీగా గడిపారు. చేపలు పట్టేందుకు వెళ్లిన యువకులకు కొర్రమీను, బొచ్చ, రావుట, పర్కా, తదితర చేపలు చిక్కాయి. 10 నుంచి 7 కిలోల సైజులో చేపలు లభిస్తుండడంతో స్థానిక యువకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇళ్లకు తీసుకెళ్లారు.