News February 7, 2025

లింగంపేట్: దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

image

లింగంపేట్ మండలం కోమట్ పల్లి గ్రామంలో శుక్రవారం కొందరు అపరిచిత వ్యక్తులను స్థానికులు పోలీస్‌‌లకు అప్పగించారు. గ్రామంలో జాతకాలు చెప్తామని, మీ ఇంట్లో అశుభం జరుగుతుందని గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసినట్లు స్థానికులు తెలిపారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

Similar News

News February 7, 2025

కోటవురట్ల: ‘వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి’

image

కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ శిశువు మృతి చెందింది. ఏటికొప్పాక నుంచి గర్భిణి కె.సుశీల దేవిని ప్రసవం కోసం ఈనెల 6వ తేదీన స్థానిక సిహెచ్సీలో బంధువులు చేర్పించారు. శుక్రవారం డెలివరీ చేయడంలో వైద్యు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే శిశు మృతి చెందిందని సుశీల దేవి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 7, 2025

సంగారెడ్డి: డబుల్ డెక్కర్ రైలును చూశారా..!

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో డబుల్ డెక్కర్ రైలు నిలిచింది. చిత్తూరు నుంచి బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ రైలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి వెళుతుండగా జహీరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. దాంతో ఇక్కడి ప్రాంత ప్రజలు అరుదైన డబుల్ డెక్కర్ రైలును ఆసక్తిగా తిలకించారు. స్టేషన్‌లోని ప్యాసింజర్లు ప్లాట్ ఫామ్ వద్ద డబుల్ డెక్కర్ రైలుతో సెల్ఫీ ఫోటోలు దిగి సందడి చేశారు.

News February 7, 2025

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

error: Content is protected !!