News January 24, 2025

లింగంపేట: ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య

image

ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు(31) అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. అతను మద్యం తాగడానికి తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో తల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టివేసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 13, 2025

MNCL: 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

image

మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌లోని ఆనంద నిలయంలో ఈ నెల 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఈ కేంద్రంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 13, 2025

నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు తదితర వివరాలను త్వరలో వెల్లడించనుంది.

News November 13, 2025

రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

image

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.