News March 14, 2025

లింగంపేట: చెరువులో పడి మహిళ మృతి

image

చెరువులో పడి ఒక మహిళ మృతి చెందినట్లు లింగంపేట ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంబోజీపేట గ్రామానికి చెందిన కాశవ్వ గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందన్నారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినట్లు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఆమె మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 7, 2025

ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

image

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.

News November 7, 2025

భారత రైతాంగ ఉద్యమపితామహుడు మన జిల్లావారే

image

రైతు జన బాంధవుడు ఆచార్య ఎన్.జీ.రంగా పొన్నూరులోని నిడుబ్రోలులో 1900 నవంబర్ 7న జన్మించారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1934లో రైతు ప్రతినిధిగా పార్లమెంటులో అడుగు పెట్టి 1991వరకు ఉభయ సభల్లో కొనసాగి, గిన్నిస్ బుక్ ఎక్కారు. నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరో రాజకీయ నాయకులను అందించారు.

News November 7, 2025

చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

image

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.