News October 8, 2025
లింగ నిర్ధారణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీసీపీఎన్డిటి యాక్ట్ సమావేశంలో మాట్లాడారు. రిజిస్టర్ కాని స్కానింగ్ సెంటర్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స్కానింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ సునీల్ దత్, న్యాయ సేవాధికారి చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
Similar News
News October 8, 2025
KMM: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో ఖమ్మం జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 20 జడ్పీటీసీ, 20 ఎంపీపీ పదవుల భవితవ్యాన్ని, అలాగే 283 ఎంపీటీసీ స్థానాలు, 571 గ్రామ సర్పంచుల స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న
News October 7, 2025
ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 56.6 మి.మీ వర్షపాతం

ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం 8:30 నుంచి నేడు ఉదయం 8:30 గంటల వరకు 56.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.7 మి.మీగా నమోదు కాగా, అత్యధికంగా ఖమ్మం రూరల్‌లో 15.4 మి.మీ అత్యల్పంగా తిరుమలాయపాలెంలో 0.8MM వర్షపాతం నమోదైంది. వేంసూరు 8.2, కల్లూరు6.4, ముదిగొండ 5.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.
News October 7, 2025
ఖమ్మ: 5 పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం: కలెక్టర్

చింతకాని మండలంలోని 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా పిల్లల రీడింగ్ సామర్థ్యం పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3–4 గంటల రీడింగ్ ఫోకస్ పీరియడ్ నిర్వహించి, ప్రతి విద్యార్థి చదివే సామర్థ్యం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.