News September 22, 2025
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఈ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News September 22, 2025
డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా డాక్టర్ల అసోసియేషన్ సోమవారం కలెక్టర్ చేకూరి కీర్తికి వినతిపత్రం సమర్పించింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గురువారం నుంచి సమ్మెకు దిగుతామని వినతిపత్రంలో హెచ్చరించారు.
News September 22, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కలెక్టర్

జవాబుదారీతనంతో పౌర సేవలు అందించే క్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఆమె ప్రజల నుంచి 178 అర్జీలు స్వీకరించారు. అర్హత కలిగిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News September 22, 2025
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: దుర్గేశ్

జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాలని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ అవసరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాజమండ్రి మంజీరా హోటల్లో “వన్ నేషన్-వన్ ఎలక్షన్”కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గుతుందన్నారు. ప్రజాస్వామ్యం బలపడటంతో పాటు సమగ్రాభివృద్ధి కోసం ఇది విప్లవాత్మక సంస్కరణ అన్నారు.