News November 15, 2024
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై చర్యలు: కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో చట్టం అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇప్పటి వరకు నమోదైన కేసులు, జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిని గురించి సమీక్షించారు. లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News November 14, 2024
హనుమకొండ: శివయ్య శిరస్సుపై జాబిల్లి
హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు లింగం శ్రీ సిద్దేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. సాయంకాలం సంధ్యా సమయంలో కార్తీక పౌర్ణమి ఘడియల్లో శివయ్య శిరస్సుపై జాబిల్లి విరజిల్లుతున్నట్లు కనిపించింది. పలువురు భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.
News November 14, 2024
రేపు డయల్ యువర్ ఆర్ఎం : విజయభాను
వరంగల్ రీజియన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ రీజన్ పరిధిలో బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు నెంబర్ 9959226056 కి ఫోన్ చేసి రీజియన్ లోని బస్సు సర్వీసులు, ప్రయాణికుల సర్వీసులు మెరుగుదలకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
News November 14, 2024
నర్సంపేట: పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి గడువు పెంపు
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. నవంబర్ 11న దరఖాస్తు చివర తేదీ కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు ఆన్లైన్‌లో చూసుకోవాలని తెలిపారు.