News March 26, 2025
లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News July 9, 2025
తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.
News July 9, 2025
సంగారెడ్డి: చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: డీఈవో

జహీరాబాద్ మండల విద్యాధికారిగా పని చేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. బుధవారం అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమన్నారు. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓలు పాల్గొన్నారు.
News July 9, 2025
సిద్దిపేట: డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి: సీపీ

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా రాజేశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధను కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ ఆయనను అభినందించి, శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.