News February 22, 2025
లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావుకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ సందిగారి బసవయ్య, ధర్మకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,64,158 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,17,832, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,820 అన్నదానం రూ.56,506 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News February 23, 2025
మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలు, ఏడుపాయల జాతరపై ఎస్పీ సమీక్ష

27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్త్, ఏడుపాయల జాతరపై మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితుల వివరాలను సేకరించాలన్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, వాటికీ ఆయుధాలు కలిగిన 8 రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయన్నారు. జాతర కోసం సూచనలు చేశారు.
News February 23, 2025
MLC స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి CMకు గిఫ్ట్ ఇవ్వాలి: మంత్రి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని మంత్రి దామోదర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ తర్వాతా మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు.