News June 4, 2024
లీడ్‌లోకి వచ్చిన పెద్దిరెడ్డి

పుంగనూరులో ఎట్టకేలకు మంత్రి పెద్దిరెడ్డి ఆధిక్యతలోకి వచ్చారు. మొదటి రౌండ్‌లో 136, రెండో రౌండ్‌లో 501 ఓట్లతో వెనుకంజలో కొనసాగారు. తాజాగా మూడో రౌండ్‌లో ఆయనకు 45 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకు పెద్దిరెడ్డికి 16,816 ఓట్లు వచ్చాయి.
Similar News
News January 28, 2026
అందుబాటులోకి ఆయుష్మాన్ భారత్ కార్డులు

చిత్తూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది వివరాలను కార్డులో అధికారులు నమోదు చేయించారు. రోగి పూర్తి వివరాలు కార్డు స్కాన్ చేయడం ద్వారా వైద్యులకు తెలిసిపోతుంది. తద్వారా వైద్య సేవలు అందించడం సులభతరం కానుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా జిల్లా, ఏరియా, సిహెచ్సీలోనూ వీటి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.
News January 28, 2026
చిత్తూరుకు మరో 450 టన్నుల యూరియా

కడప జిల్లా నుంచి మరో 450 టన్నుల యూరియా చిత్తూరు జిల్లాకు బుధవారం రానుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,301 టన్నుల యూరియా నిల్వలున్నాయన్నారు. వీటిని 230 రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తున్నామని వెల్లడించారు.
News January 28, 2026
రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు

కుప్పం (M) మల్లానూరు నుంచి అడవి బూదుగూరు మీదుగా తమిళనాడు బోర్డర్ వరకు రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లనూరు నుంచి తమిళనాడు బోర్డర్ వరకు సింగల్ రోడ్డు ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ నిధులు మంజూరు చేసింది.


