News September 10, 2025
లేఅవుట్ అనుమతుల్లో నిబంధనలు పాటించాలి: కలెక్టర్

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన లేఅవుట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్ అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని స్పష్టం చేశారు. రోడ్లు, సీవరేజ్, వీధి దీపాలు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నీటి వనరుల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వరాదని, అధికారులు పారదర్శకతతో పాటు పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు.
Similar News
News September 10, 2025
ఖమ్మం: పారదర్శకంగా గ్రామ పరిపాలన అధికారుల కౌన్సిలింగ్

ఖమ్మం కలెక్టరేట్‌లో గ్రామ పరిపాలన అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పైరవీలకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 299 క్లస్టర్లలో 252 మందికి పోస్టింగ్‌లు కల్పిస్తున్నామని చెప్పారు.
భూ భారతి చట్టం అమలు, భూ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
News September 10, 2025
ఝార్ఖండ్ సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. భేటీలో తమ అనుభవాలను పంచుకోవడం, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందించాలనే అంశాలపై చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
News September 10, 2025
‘జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం అర్బన్ పరిధిలోని బల్లెపల్లిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. సుమారు 21 ఎకరాల భూమిలో 3000 మంది విద్యార్థులకు అనువైన అధునిక వసతులతో చేపట్టిన నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.