News November 11, 2025

లేటెస్ట్ అప్‌డేట్స్

image

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు

Similar News

News November 11, 2025

‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.

News November 11, 2025

ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

image

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

News November 11, 2025

ఆరా మస్తాన్ సర్వే.. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దే!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 47.49%, BRSకు 39.25%, BJPకి 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే తదితర ఎగ్జిట్ పోల్స్ సైతం హస్తం పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. మరి మీరు ఏ పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. కామెంట్ చేయండి.