News March 31, 2025
లేపాక్షి: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్ఏ ఇంటి పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Similar News
News April 2, 2025
చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్: CM

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి అభ్యర్థన మేరకు చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే చినగంజాంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేస్తామన్నారు. కొమ్ముమూరి కాలువ ఆధునికీకరణ, మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, మినీ స్టేడియం, మోటుపల్లి నుంచి కారిడార్ నిర్మాణానికి సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు.
News April 2, 2025
గిబ్లీ ట్రెండ్‌లోకి పుట్టపర్తి ఎమ్మెల్యే

సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఫొటోలు వైరల్‌గా మారాయి. ChatGPT ప్రవేశపెట్టిన గిబ్లీ ఫీచర్ ఉచితంగా అందుబాటులోకి రావడంతో అందరూ తెగ వాడేస్తున్నారు. ప్రముఖులూ తమ ఫొటోలను యానిమే స్టైల్లోకి మార్చుకుంటున్నారు. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుతో ఉన్న ఫొటోను గిబ్లీ స్టైల్లోకి మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
News April 2, 2025
SKLM: వివరాలు తెలిపిన వ్యక్తికి బహుమతి

జలుమూరు మండలంలో మార్చి 29వ తేదీ రాత్రి వివిధ ఆలయాల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాతలు రాశారు. ఈ మేరకు స్పందించిన ఎస్పీ, రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియజేసిన వారికి రూ. 25వేల నగదు పురస్కారం బహుమతిగా ఇస్తామని మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.