News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News March 30, 2025
అనంత: ఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

నేడు ఉగాది, రేపు రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ రూ.180-190గా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150తో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700 నుంచి రూ.750గా ఉంది.
News March 30, 2025
అనంత: ఆ గ్రామంలో ఏడేళ్ల తర్వాత ఉగాది ఉత్సవాలు.. అసలేం జరిగింది..?

అనంతపురం పుట్లూరు మండలం మడుగుపల్లిలో ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు. అయితే ఏడేళ్ల క్రితం గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామికి ఎడ్లబండ్లను కట్టి గుడి వద్దకు వెళ్తున్న సమయంలో ‘మా బండి ముందు వెళ్లాలంటే.. మా బండి ముందు వెళ్లాలి’ అంటూ పెద్దఎత్తున రాళ్లదాడులు చేసుకోవడంతో పోలీసులు ఉత్సవాలను నిలిపివేశారు. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత తిరిగి ఉత్సవాలు జరగనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 30, 2025
అండర్-20 స్టేట్ ఫుట్‌బాల్ టీంకు ఎంపికైన గుత్తి విద్యార్థి

గుత్తిలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సాయి శ్రీనివాస్ నారాయణ అండర్-20 స్టేట్ ఫుట్‌బాల్ టీంకు ఎంపికైనట్లు కోచ్ ప్రసాద్ శనివారం చెప్పారు. రెండు రోజుల క్రితం అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో అండర్-20 స్టేట్ ఫుట్‌బాల్ టీం సెలక్షన్స్ జరిగాయి. సాయి శ్రీనివాస్ నారాయణ అత్యంత ప్రతిభ కనబరిచాడు. దీంతో సాయి శ్రీనివాస్ నారాయణను స్టేట్ టీంకు ఎంపిక చేశారు.