News November 10, 2025
లైంగిక వేధింపులు ఎదురైతే..

బహిరంగ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సదరు వ్యక్తిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ 354(ఎ), 354(డి), BNS సెక్షన్ 79 కింద కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్ 354 కింద మహిళపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.
Similar News
News November 10, 2025
₹750 కోట్లతో నేచురోపతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: మంత్రి

AP: తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ రాష్ట్రంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ₹750 కోట్లతో కేంద్రం నెలకొల్పే దీనిలో బ్యాచ్‌లర్ ఆఫ్ నేచురోపతి యోగా సర్జరీలో 100 సీట్లు, PGలో 20 సీట్ల చొప్పున తొలి ఏడాదిలో ఉంటాయన్నారు. దీనికోసం 40 ఎకరాలు కావాలని కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. 450 పడకల నేచురోపతి ఆసుపత్రీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
News November 10, 2025
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 10, 2025
భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.


