News November 11, 2025

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దు: కలెక్టర్

image

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటించాలని సూచించారు. 18 ఏళ్ల నిండకుండా లైసెన్స్ పొందకుండానే వాహనాలు నడపొద్దని, సరైన శిక్షణ పొందకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. యువత రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు.

Similar News

News November 11, 2025

WGL: ‘అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు కాల్ చేయండి’

image

ప్రజా భద్రత పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో స్నిఫర్ డాగ్స్‌తో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు ప్రజా రక్షణను పటిష్ఠం చేస్తాయని అధికారులు తెలిపారు.

News November 11, 2025

గ్రామీణ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రంగంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను మంగళవారం కలెక్టర్ కోయ హర్ష ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలన్నారు. టైలరింగ్, మగ్గం వర్క్ వంటి రంగాలలో శిక్షణ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపర్ణ రెడ్డి, రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

News November 11, 2025

కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

image

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.