News October 19, 2025

లొద్ద అందాలను ‘క్లిక్’ మనిపించిన కలెక్టర్

image

సాలూరు మండలం గిరిశిఖర పంచాయతీ కొదమ పంచాయతీ లొద్ద అందాలను పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి స్వయంగా తన సెల్ ఫోన్లో బంధించారు. ఆదివారం ఉదయం లొద్ద ప్రాంతం చూడటానికి బయలుదేరారు. కలెక్టర్ వాహనం పైకి వెళ్లకపోవడంతో కమాండర్ జీపుతో లొద్ద జలపాతం వద్ద చేరుకున్నారు. ఈ క్రమంలో పకృతి అందాలను ఫొటోలు తీశారు.

Similar News

News October 19, 2025

జిల్లాలో 287 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్‌

image

జనగామ: ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు 592 మె.ట ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News October 19, 2025

ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి: సీఎం

image

తెలంగాణ ప్రజలకు CM రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

ధాన్యం కొనుగోళ్లపై పక్కా కార్యచరణ: జనగామ కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతి సీజన్‌లో జిల్లా యంత్రాంగం రికార్డు సృష్టిస్తోందని, అదే స్ఫూర్తితో ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యచరణ రూపొందించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు వచ్చే చివరి గింజను కూడా కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.