News May 24, 2024
లోకేశ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్.. మీ COMMENT.!

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.
Similar News
News April 23, 2025
కాస్త మెరుగుపడ్డ కృష్ణా జిల్లా స్థానం

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణాజిల్లా స్థానం కొంతలో కొంత మెరుగుపడింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 85.32% ఉత్తీర్ణతతో జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా జిల్లా 11వ స్థానానికి పరిమితమవుతూ వచ్చింది. 2022-23లో 74.67%, 2023-24 సంవత్సరంలో 90.05% ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది 20,776 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,726 మంది ఉత్తీర్ణులయ్యారు.
News April 23, 2025
10th RESULTS: 10వ స్థానంలో కృష్ణా జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 85.32%తో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. మొత్తం 20,776 మంది పరీక్షలు రాయగా 17,726 మంది పాసయ్యారు. 10,783 బాలురులో 8,998 మంది, 9,993 మంది బాలికలు పరీక్ష రాయగా 8,728 మంది పాసయ్యారు.
News April 23, 2025
స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.