News April 10, 2025

లోకేశ్వరం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలం రాజురలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతాని నడ్పి మల్లన్న( 62) తన పంట చేనులో నీటికోసం దాదాపు 20 బోర్లను వేయించగా నీరు పడక పంటలు ఎండిపోయాయి. చేసిన అప్పులు భారంగా మారడంతో రైతు తన పంట చేనులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమన్నారు.

Similar News

News April 18, 2025

గుమ్మగట్ట: కరెంట్ షాక్‌తో టెన్త్ విద్యార్థి మృతి

image

గుమ్మగట్ట మండలం గొల్లపల్లిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కార్తీక్ (16) ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తండ్రితో కలిసి కుమారుడు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. యువకుడు గత నెలలోనే పది పరీక్షలు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

News April 18, 2025

కడపలో ఇదే దొంగల కారు జాగ్రత్త..!

image

నెల్లూరు జిల్లాలో వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు కడప జిల్లా వైపు రావడంతో కడప పోలీసులకు సమాచారమిచ్చారు. లింగాపురం వద్ద కాపు కాసిన పోలీసులను చూసి కల్లూరు మీదుగా పరారయ్యారు. వి.రాజుపాలెం వద్ద ఒకరు దొరకకగా ఇద్దరు జంపయ్యారు. ట్రైనీ DSP భవాని, చాపాడు, కమలాపురం పోలీసుల సమన్వయంతో వాహనం స్వాధీనం చేసుకున్నారు.

News April 18, 2025

ఉదయాన్నే నోటిని ఆయిల్‌తో పుక్కిలిస్తే..

image

ఉదయాన్నే నోటిని ఆయిల్‌తో పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడడంతో పాటు బలోపేతం అవుతాయని, నోటి దుర్వాసన పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంని, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తుందని పేర్కొంటున్నారు. ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి/ నువ్వుల/ సన్ ఫ్లవర్ నూనెను ఉపయోగించవచ్చని.. 15-20min పుక్కిలించి, తర్వాత గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!