News November 12, 2024
లోకేశ్వరం: సమగ్ర సర్వేని బహిష్కరించిన ధర్మోరా గ్రామస్థులు
వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.
Similar News
News November 14, 2024
మంచిర్యాలలో బాలికపై అత్యాచారయత్నం
11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఒడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ అదే కాలనీకి చెందిన ఓ బాలికను హైటెక్ సిటి వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు వెల్లడించారు.
News November 14, 2024
ADB: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి: సురేంద్ర మోహన్
జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగానే సాగుతుందని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో అధికారులతో, ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు, అభ్యంతరాలు, దరఖాస్తులకు ఈనెల 28 వరకు అవకాశం ఉందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు.
News November 13, 2024
నగదు స్వాధీనంపై కమిటీ ఏర్పాటు : ఆదిలాబాద్ కలెక్టర్
మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగదు స్వాధీనంపై ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. కమిటీలో జిల్లా పరిషత్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా జితేందర్, జిల్లా సహకార అధికారి కమిటీ సభ్యుడు బి.మోహన్, జిల్లా ట్రెజరీ అధికారిగా హారికను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.