News October 12, 2025
లోకేశ్ గారు మీరైనా మా’ఘోష’ వినరా..!

ఉక్కు యాజమాన్యం ఉద్యోగుల పిల్లల కోసం 1984లో తమ సొంత ఆర్ధిక వనరులతో విశాఖ విమల విద్యాలయం పాఠశాలను ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఉక్కు ఉద్యోగుల పిల్లలు లేరనే దురుద్దేశ్యంతో అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి వారిని రోడ్డున పడేశారు. దీంతో సిబ్బంది జూన్ 12 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఉక్కు యాజమాన్యంతో మంత్రి లోకేశ్ మాట్లాడి పాఠశాల పునఃప్రారంభించాలని సిబ్బంది వేడుకుంటున్నారు.
Similar News
News October 12, 2025
విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ ఆదివారం కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రుషికొండ ఐటీ హిల్ నం.3లో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మహిళల వన్డే మ్యాచ్ వీక్షించునున్నారు.
News October 12, 2025
వృద్ధురాలి దోపిడీ ఘటనలో మనవడే సూత్రధారి: ఏసీపీ

అగనంపూడిలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన ఘటనలో మనవడే సూత్రధారి అని ఏసీపీ నర్సింహమూర్తి పోలీసులు తెలిపారు. సురేశ్ తన స్నేహితుడు సుమంత్‌తో కలిసి అన్నెమ్మను బెదిరించి 5తులాల బంగారు గాజులు దోచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో సుమంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా సురేశ్ సహకారంతోనే దోపిడీకి పాల్పడినట్లు చెప్పాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.
News October 12, 2025
భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దండి: మేయర్

విశాఖ వేదికగా జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం తాటిచెట్లపాలెం, న్యూకాలనీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పలు సెంటర్లలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను చేపట్టాలని మేయర్ ఆదేశించారు.