News December 21, 2025

లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

image

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Similar News

News December 31, 2025

కోనసీమ నుంచి తూర్పుగోదావరికి మూడు మండలాలు!

image

జిల్లాల పునర్విభజన చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ నుంచి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో చేర్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం అధికారికంగా వెల్లడించారు. తాజా మార్పులతో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిధి మారనుంది.

News December 31, 2025

అతిపెద్ద జిల్లాగా అవతరించనున్న ‘తూ.గో.’

image

మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై అధికారిక కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం కేంద్రంగానే సాగనున్నాయి. ఈ విలీనంతో తూ.గో. జిల్లా విస్తీర్ణం పెరిగి భారీ జిల్లాగా అవతరించనుంది. నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో విలీన ప్రక్రియపై చర్చించనున్నారు.

News December 31, 2025

తూ.గో.లో ‘మత్తు’ రికార్డు.. డిసెంబర్‌లోనే 100 కోట్లు హాంఫట్!

image

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు అధికార గణాంకాలు తెలిపాయి. కొత్త ఏడాది వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ రూ.25 కోట్ల విలువైన 1.60 లక్షల కేసుల మద్యాన్ని సిద్ధం చేసింది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.