News December 15, 2025

లోకేశ్ వెళ్తున్న విమానం దారి మళ్లింపు

image

AP: ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కారణంగా మంత్రి లోకేశ్ వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరగా, విమానాన్ని జైపూర్‌కు పంపారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇప్పటిదాకా 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను దారి మళ్లించారు. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ విమానం <<18569475>>ఆలస్యమైన<<>> విషయం తెలిసిందే.

Similar News

News December 18, 2025

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

image

AP: సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనమిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం’ అని ట్వీట్ చేశారు.

News December 18, 2025

అంటే.. ఏంటి?: Espionage..

image

గూఢచర్యం (నిఘా)తో రహస్య, ముఖ్య సమాచారం సేకరించడాన్ని ఇంగ్లిష్‌లో Espionage అంటారు. ఇందుకోసం వ్యక్తులు లేదా జంతువులు లేదా ఇతర ప్రాణులు, డివైజ్‌లను వ్యక్తులు/సంస్థలు వాడుతాయి. ఈ పదం ఫ్రెంచ్ భాషలోని Espionnage (Spy) నుంచి పుట్టింది.
తరచుగా వాడే పర్యాయ పదాలు: Spying, Surveillance
– రోజూ 12pmకు ‘అంటే.. ఏంటి?’లో ఓ ఇంగ్లిష్ పదానికి అర్థం, పద పుట్టుక వంటి విషయాలను తెలుసుకుందాం.
Share it

News December 18, 2025

NHIDCLలో 64 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com