News February 5, 2025
లోక్‌సభలో నెల్లూరు ఎంపీ ఏంమాట్లాడారంటే?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు పలు అంశాలపై ఆయన లోక్‌సభలో ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
Similar News
News April 23, 2025
ఆధునిక పరిజ్ఞానంతో నేర పరిశోధన: ఎస్పీ

నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి కేసులు దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈగల్ టీం రూపొందించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ఎస్పీ ఆవిష్కరించారు.
News April 23, 2025
నెల్లూరు: రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఫిర్యాదు

నెల్లూరు జిల్లాలో అనుమతి లేని రియల్ ఎస్టేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ గౌడ్ కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లో డీఆర్వో ఉదయభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారన్నారు. బోగస్ ప్రకటనతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. 13వ స్థానానికి చేరుకున్న నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో టెన్త్ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఆశాజనకంగా నమోదయ్యాయి. గతేడాది 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో జిల్లా నిలవగా.. తాజాగా 83.58 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు.