News September 15, 2025

లోక్‌సభలో 9 చర్చల్లో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ

image

లోక్‌సభలో(2024-25) ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఇందులో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ లోక్‌సభలో మొత్తంగా 61 ప్రశ్నలు అడిగారు. 9 చర్చల్లో పాల్గొన్నారు. 88.24 హాజరు శాతం కనబర్చారు.

Similar News

News September 15, 2025

ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకున్న కడెం ప్రాజెక్టు

image

నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కడెం ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనం. 1949లో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. 1995, 2022, 2023వ సంవత్సరాల్లో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వచ్చినప్పటికీ పటిష్టంగా నిలబడింది. ఇది నాటి ఇంజినీర్ల పనితీరు, దూరదృష్టికి నిలువుటద్దంలా కనిపిస్తోంది.

News September 15, 2025

జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

image

జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట శివారులో ఆదివారం రాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన యువకుడు నహీముద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2025

‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

image

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.