News March 19, 2024

లోక్‌సభ ఎన్నికలపై ఎమ్మెల్యేల సమావేశం

image

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో సమావేశమయ్యారు. ZHB పరిధిలోని ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వ్యూహం, పార్టీలో చేరికలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో సురేష్ శెట్కార్, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ తదితరులు ఉన్నారు.

Similar News

News January 23, 2026

NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

image

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.

News January 23, 2026

NZB: టీచర్‌గా మారిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నిజామాబాద్ గంగస్థాన్‌లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.