News September 14, 2025
లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో నంద్యాల MPకి 11వ ర్యాక్

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో నంద్యాల MP బైరెడ్డి శబరి 11వ స్థానంలో నిలిచారు. ఆమె లోక్‌సభలో మొత్తం ప్రశ్నలు 78 అడగగా, 09 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆమె హాజరు శాతం 82.35గా ఉంది. మరి MP పని తీరుపై మీ కామెంట్..!
Similar News
News September 14, 2025
గుంటూరు: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణరావు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎన్నికయ్యారు. విజయనగరంలో జరుగుతున్న 18వ ఏపీ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక మహాసభలలో ఆయన ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కశాకర్, యుటీఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయుకులు, తాదితర సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సన్మానం నిర్వహించారు.
News September 14, 2025
BREAKING: భారత్ ఓటమి

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.
News September 14, 2025
రూ.153 కోట్లతో USలో ఇల్లు కొన్న అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. న్యూయార్క్‌లోని ఈ ఇంటి విలువ $17.4 మిలియన్లు (రూ.153 కోట్లు) అని పేర్కొంది. గత పదేళ్లుగా అది ఖాళీగా ఉందని తెలిపింది. 2018లో రాబర్ట్ పేరా $20 మిలియన్లకు దీన్ని కొనుగోలు చేశారు. 20వేల స్క్వేర్ ఫీట్ల ఈ భారీ భవంతిలో 7 బెడ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, 5వేల స్క్వేర్ ఫీట్ల ఔట్ డోర్ స్పేస్ ఉన్నాయి.