News September 14, 2025

లోక్ అదాలత్‌లో 1,466 కేసులకు పరిష్కారం: కిరణ్ ఖరే

image

భూపాలపల్లి జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ అదాలత్‌లో మొత్తం 1,466 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమైనట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐపీసీ, బీఎన్‌ఎస్, సైబర్ క్రైమ్, డీడీ, ఎంవీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను పరిష్కరించామని ఎస్పీ తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమనే భావన ఉండాలని అన్నారు.

Similar News

News September 14, 2025

6 పరుగులకే 2 వికెట్లు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.

News September 14, 2025

గుంటూరు: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణరావు

image

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎన్నికయ్యారు. విజయనగరంలో జరుగుతున్న 18వ ఏపీ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక మహాసభలలో ఆయన ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కశాకర్, యుటీఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయుకులు, తాదితర సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సన్మానం నిర్వహించారు.

News September 14, 2025

BREAKING: భారత్ ఓటమి

image

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.