News July 6, 2025

లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారం

image

మదనపల్లెలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమైనట్లు అదాలత్ సిబ్బంది తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించిన కక్షదారులను రాజీమార్గంలో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. క్రిమినల్ 144 కేసులు, సివిల్ 25 కేసులు మొత్తం 169 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారంగా రూ.77 లక్షలు అందజేశారు.

Similar News

News July 6, 2025

విశాఖలో రేపు P.G.R.S.

image

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు‌ P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.

News July 6, 2025

తాండూర్: లారీ ఢీకొని ఒకరి మృతి

image

తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక డాబా నుంచి బిర్యానీ తీసుకుని తాండూర్ బోర్డు వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాసిపేటకు చెందిన మల్లేశ్ గౌడ్(36)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

News July 6, 2025

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి: ఎస్పీ

image

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపులు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థతో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.