News December 22, 2025
లోక్ అదాలత్‌లో 3,884 కేసుల పరిష్కారం: సూర్యాపేట ఎస్పీ

జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,884 కేసులు పరిష్కారమైనట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఇందులో 446 క్రిమినల్, 1,582 ఈ-పెట్టీ, 1,856 ఎంవీ యాక్ట్ కేసులు ఉన్నాయి. అలాగే 33 సైబర్ కేసుల్లో రూ.11.50 లక్షలను బాధితులకు రీఫండ్ చేయించారు. పోలీస్, న్యాయశాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని, ముందస్తు ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
ఆయుర్వేద వైద్యులూ కొన్ని ఆపరేషన్లు చేయొచ్చు: సత్యకుమార్

AP: PG ఆయుర్వేద వైద్యవిద్యను పూర్తిచేసిన వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేసేందుకు మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. CCIM, NCISM రూల్స్ ప్రకారం ఆపరేషన్లు చేసేలా వీరిని అనుమతిస్తారు. 39 జనరల్, 19 ENT, ఆప్తాల్మాలజీ, ఇతర చికిత్సలను ఈ వైద్యులు చేయొచ్చు. వీటిపై తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయుష్ విభాగం డైరెక్టర్‌తో మంత్రి చర్చించారు. భారతీయ వైద్యవిధానం ఆధునిక ప్రక్రియతో అనుసంధానించడం ఎంతో మేలన్నారు.
News December 23, 2025
తిరుమల మెట్ల మార్గంలో దయనీయ పరిస్థితి: MP వంశీకృష్ణ

TG: తిరుమల మెట్ల మార్గం దయనీయంగా ఉందని పెద్దపల్లి(TG) MP వంశీకృష్ణ తెలిపారు. తన తాత వర్ధంతి సందర్భంగా కుటుంబంతో మెట్ల మార్గంలో వెళ్లినప్పటి పరిస్థితులపై ట్వీట్ చేశారు. ‘ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. టాయిలెట్ల కమోడ్లు, మెట్ల మధ్య పెట్టిన ట్రేలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మొదటి మెట్టు వద్ద వాహనాల మధ్య నుంచి భక్తులు రోడ్డు దాటాల్సి వస్తోంది. వెంటనే స్పందించండి’ అని లోకేశ్‌ను ట్యాగ్ చేశారు.
News December 23, 2025
ఆపదలో ఉన్నవారి లొకేషన్ కనిపెట్టే గూగుల్ ఫీచర్!

ఇండియాలో గూగుల్ Android Emergency Location Service (ELS)ను లాంచ్ చేసింది. ప్రమాదంలో ఉన్నప్పుడు 112కి కాల్ లేదా మెసేజ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్‌గా మీ లొకేషన్‌ను పోలీసులకు పంపిస్తుంది. కాల్ కట్ అయినా సరే GPS, Wi-Fi సిగ్నల్స్ ద్వారా మీరు ఎక్కడున్నారో వాళ్లు ఈజీగా కనిపెట్టగలరు. ఈ ఫ్రీ సర్వీస్ ప్రస్తుతం UPలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలుకానుంది.


