News December 22, 2025

లోక్ అదాలత్‌లో 4,589 కేసులు పరిష్కారం: ఎస్పీ

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 4589 కేసులు పరిష్కారం అయ్యాయని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన క్యాలెండర్ కేసులు-383, డ్రంక్&డ్రైవ్-3098, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, ఈ-పెట్టి కేసులు-1117 తదితర కేసులు మొత్తం 4589 కేసులు పరిష్కారం అయ్యాయని అన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ గురించి వారం రోజులుగా పోలీసు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు.

Similar News

News December 25, 2025

MBNR: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు

image

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్‌నగర్ బాలికల జట్టు రన్నర్స్ (2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ రాజు ‘Way2News’ప్రతినిధితో తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.

News December 25, 2025

ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

image

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 25, 2025

త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

image

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్‌ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.