News March 7, 2025

లోక్ అదాలత్.. కడప జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడపలో 5, ప్రొద్దుటూరు 3, రాజంపేట 3, రాయచోటి 2, బద్వేల్ 2, జమ్మలమడుగు 1 బెంచీ చొప్పున 16 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News April 13, 2026

నాగర్‌కర్నూల్: జనగణనకు పటిష్ట ఏర్పాట్లు – కలెక్టర్

image

జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా వ్యాప్తంగా 1,799, 263 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. వీరికి ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో చేపట్టే ఇండ్ల గణనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 13, 2026

విశాఖ: స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

image

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీ‌ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2026

NGKL జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

image

NGKL జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.80 శాతం హాజరు నమోదైందని, పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన వెల్లడించారు.