News September 14, 2025
లోక్ అదాలత్ ద్వారా 4625 కేసులు పరిస్కారం: CP

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 4625 కేసులు పరిష్కారమయ్యాయని CP సునీల్ దత్ తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 4625 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు 712, ఈ పెటీ కేసులు 775, డ్రంకన్ & డ్రైవ్ కేసులు 2972, మైనర్ డ్రైవర్ కేసులు 8, సైబర్ కేసులు 158 పరిష్కరించడం ద్వారా రూ.52,11,246 బాధితులకు అందజేశారన్నారు.
Similar News
News September 14, 2025
‘టీజీఈ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం చేయండి’

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు TGE హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు సమావేశం నిర్వహించారు. CM రేవంత్, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు.
News September 14, 2025
ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం ఖమ్మం SR&BGNR కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఉదయం సెషన్‌లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
News September 14, 2025
KMM: డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు రావాలని సూచించారు. అడ్మిషన్ల వివరాలను ఈనెల 17న ‘దోస్త్’ పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.