News July 29, 2024
లోక్ సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న BJPకి లోక్ సభలో విప్‌గా బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ సభ స్పీకర్‌కు పార్టీ తరుఫున చీఫ్ విప్, విప్‌లుగా నియమించిన వారి పేర్లను తెలియజేశారు. రాష్ట్రం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 20, 2026
రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.
News February 20, 2026
HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.